సమంతని కోడలిగా పరిచయం చేసిన నాగ్! వదినతో అఖిల్ సందడి..

Nagarjuna introduced Samantha as daughter in law!!! Quite intresting.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది… ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా నటించిన సామ్ చైతుల జోడీ చాలా బాగుంది అనిపించింది..ఆటోనగర్ సూర్య, మనం సినిమాలతో చైతుతో జోడీ కట్టిన సామ్.. చైతుల ప్రేమాయణం పై గత కొంత కాలంగా మీడియాలో.. సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.. ఇద్దరు కలిసి కేఫ్ ల్లో.. సినిమా థియేటర్స్ వద్ద సందడి చేస్తూనే ఉన్నారు. కానీ వారి ప్రేమ, పెళ్లి పై ఏవిధమైన క్లారిటీ ఇవ్వలేదు..

Akkineni-family-at-Nimmagadda-Prasad-Daughter-Wedding

కాగా ఒకానొక సమయంలో సమంత ను కోడలిగా నాగ్ అంగీకరించలేదని.. అపుడు తన తల్లి ద్వారా లైన్ క్లియర్ చేసుకొన్నాడనే టాక్ కూడా వినిపించింది.. కాగా ఇప్పుడు నాగ చైతన్య.. సమంత ల పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది.. ప్రముఖ బిజినెస్ మేన్ నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతి వివాహం ఎంపీ.. టి. సుబ్బిరామిరెడ్డి చెల్లెలు కొడుకుతో జరిగింది.. ఈ వేడుకకు నాగార్జున అమలలు పెద్ద కుమారుడు నాగచైతన్య, అఖిల్ లతో పాటు తనకు కాబోయే కోడలు సమంత లతో హాజరయ్యారు.. సమంత హీరోయిన్ గా కాకుండా.. ఒక సగటు మహిళగా రెడీ అయ్యి వచ్చింది.. ఈ పెళ్లి వేడుకలో చైతు.. సమంత ల జంటగా తిరుగుతూ.. Center of attraction నిలిచారు.. ఈ వేడుకలో సమంతను తనకు కాబోయే కోడలిగా అందరికీ పరిచయం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.. ఈ చూడ చక్కని జోడీ అని అందరూ వ్యాఖ్యానిస్తుండగా.. అఖిల్ కూడా తనకు కాబోయే వదినమ్మతో చాలా బాగా పెళ్లిని ఎంజాయ్ చేశాడు… నాగార్జున మనం సినిమా సమయం నుంచి సమంతని అమ్మ అనే పిలుస్తాడు అనే సంగతి విధితమే.. దీంతో వీరి ఫ్యామిలీ పిక్ ను చూసిన వారు అమ్మని కొడలిగా తీసుకొని రావడానికి అంగీకరించాడని.. మొత్తానికి చైతు.. సామ్ లు తమ ప్రేమను గెలిపించుకొన్నారని.. ఇక పెళ్లి సందడే మిగిలిందని అంటున్నారు

Leave a Reply